వంగూర్ మండలం తిప్పారెడ్డిపల్లి గ్రామంలో శుక్రవారం ఉదయం చిరుత పులి సంచరిస్తూ రైతులకు కంటపడింది. బద్దుల లింగమయ్య అనే రైతు పొలంలో చిరుత తిరుగుతుండగా చూశామని గ్రామ రైతు పులిగిల్ల కిషోర్ రావు తెలిపారు. ఉదయం చేనుకు నీళ్లు పెడుతుండగా చిరుత పొలంలో అటు ఇటు తిరుగుతూ కనిపించిందని అన్నారు. చిరుత పాదముద్రలను రైతు ఫోటో తీశారు. ఈ సంఘటనతో గ్రామంలో ఆందోళన నెలకొంది.