తూర్పుగోదావరి జిల్లా, నల్లజర్ల మండలం గుండేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఒకటో తారీఖున ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు పంపిణీ పండుగ వాతావరణంలో జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.