ఎన్ఎంఎంఎస్‌లో సత్తా చాటిన విద్యార్థిని

2096చూసినవారు
ఎన్ఎంఎంఎస్‌లో సత్తా చాటిన విద్యార్థిని
కిర్లంపాడు మండలం జగపతినగరం విద్యా నవోదయ ట్యూషన్ సెంటర్ నందు శిక్షణ ఇవ్వబడిన ఏకైక విద్యార్థిని మొల్లేటి లక్ష్మీ ప్రసన్న నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్ షిప్‌కు ఎంపికైందని ట్యూషన్ సెంటర్ అధినేత దాడి వినోద్ తెలిపారు. ప్రతి సంవత్సరం నవోదయ సీట్లు సాధిస్తూ ఈ సంవత్సరం ఎన్ఎంఎంఎస్ సీటు పొందడం ఆనందంగా ఉందని వినోద్ తెలిపారు. మంచి అధ్యాపకులతో శిక్షణ ఇవ్వడంతోనే ప్రసన్న ఎన్ఎంఎంఎస్‌ స్కాలర్ షిప్ సాధించిందని తెలిపారు. ఈ సందర్భంగా ట్యూషన్ సెంటర్ అధినేత దాడి వినోద్, పలువురు ప్రముఖులు ప్రసన్నను అభినందిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్