జగ్గంపేట: పసిడి వస్తువులు చోరీ పై కేసు నమోదు

55చూసినవారు
జగ్గంపేట: పసిడి వస్తువులు చోరీ పై కేసు నమోదు
బ్యాగులో ఉంచిన బంగారు వస్తువులు కనిపించడం లేదని మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శివనాగబాబు శుక్రవారం తెలిపారు. మొల్లేటి సుగుణ అక్టోబర్ 7న యర్రవరం సెంటర్లో ఆటో ఎక్కి గండేపల్లి మండలం మురారికి పుట్టింటికి చేరుకున్నారు. తనతోపాటు తీసుకొచ్చిన లగేజీలో ఉన్న బంగారు పాపిడిబొట్టు, హారం, నెక్లెస్ ఉంచిన బాక్సు కనిపించలేదని అప్పటినుంచి వెతికినా దొరక్కపోవడంతో స్టేషన్లో ఫిర్యాదు చేశారని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్