ప్రధాన రహదారుల్లో ఫ్లెక్సీలు నిషేధం

69చూసినవారు
ప్రధాన రహదారుల్లో ఫ్లెక్సీలు నిషేధం
కాకినాడ నగర సుందరీకరణ, ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకొని దశల వారీ కార్యాచరణలో భాగంగా నగరంలోని ముఖ్య ప్రాంతాలలో ఫ్లెక్సీలు, హోర్డింగులు బ్యానర్లను నిషేధిస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ జే వెంకటరావు తెలిపారు. కాకినాడలో శుక్రవారం సాయంత్రం ఒక ప్రకటనవిడుదల చేశారు. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి ఆదేశాల మేరకు నిర్దేశించిన ప్రాంతాలను ఫ్లెక్సీ ఫ్రీ రోడ్స్ గా తీర్చిదిద్దుతామన్నారు.

సంబంధిత పోస్ట్