సునీల్.. కల్కి సినిమాలో అమితాబ్ డూప్ ఇతనే

558చూసినవారు
సునీల్.. కల్కి సినిమాలో అమితాబ్ డూప్ ఇతనే
దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన 'కల్కి 2898 ఏడీ’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాలో అశ్వత్థామ పాత్రలో అమితాబ్ బచ్చన్ మెప్పించారు. అయితే అమితాబ్ 7 అడుగుల కంటే ఎత్తులో కనిపించడంతో ప్రేక్షకులు ఎంతగానో ఆశ్చర్యపోయారు. అయితే అది గ్రాఫిక్స్ కాదు. అమితాబ్ డూప్‌గా జమ్మూకాశ్మీర్‌కు చెందిన సునీల్ నటించారు. ఆయన ఎత్తు 7 అడుగుల 7 అంగుళాలు. స్త్రీ 2 చిత్రంలోనూ ఆయన నటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్