క్లాప్ వాహన డ్రైవర్లు బకాయి జీతాలు చెల్లించాలని చేపట్టిన ఆందోళన 16వ రోజుకు న శనివారం కాకినాడలో ఆందోళనలో భాగంగా భానుగుడి సెంటర్ లో ఖాళీ కంచాలతో తమ నిరసనని తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు కాకినాడ నగర కన్వీనర్ మలక వెంకటరమణ మాట్లాడుతూ గత 16 రోజుల నుంచి పలు రూపాల్లో ఆందోళన చేపడుతున్న మూడు నెలల జీతం వేయించడంలో జిల్లాలో ఉన్న అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం జరుగుతుందని తెలిపారు.