కాకినాడ రూరల్ నియోజకవర్గంలో 50వేలకు పైగా సభ్యత్వాలు నమోదు చేసి జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని మాజీ ఎమ్మెల్యే పిల్లి అన్నంత లక్ష్మి, కో ఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణ మూర్తి పేర్కొన్నారు. కాకినాడ రూరల్ వలసపాకలలోని తమ నివాసం వద్ద ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు ప్రజలు 30వేలకు పైగా నూతన సభ్యత్వాలు నమోదు చేసుకున్నారని తెలిపారు.