విద్యతోనే సమాజ అభివృద్ధి జరుగుతుందని ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ నియోజకవర్గం కో-కోఆర్డినేటర్ కటకంశెట్టి వెంకట ప్రభాకర్ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలంలోని వేళంగి గ్రామంలోని ‘ఎయిమ్ కిడ్జ్’ స్కూల్ 9వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.