కాకినాడ యాంకరేజి పోర్టు ద్వారా పీడిఎస్ బియ్యం అక్రమంగా విదేశాలకు తరలి పోకుండా నిరోధించేందుకు పటిష్టమైన నిఘా, నిశితమైన తనిఖీ వ్యవస్థలను ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ షన్మోహన్ సగిలి తెలిపారు. కాకినాడ యాంకరేజ్ పోర్టు నుంచి విదేశాలకు పీడిఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారంతో బుధవారం యాంకరేజి పోర్టులో స్టేల్లా ఎల్ నౌకలో లోడింగ్ జరుగుతున్న బియ్యాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.