తాజాగా కాకినాడ జిల్లాలో దారుణం జరిగింది.ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆన్ లైన్ బెట్టింగ్ గేమ్స్ ఉచ్చులో పడి ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. యు.కొత్తపల్లి మండలం రామన్నపాలెంకు చెందిన సింగిరి మళ్ళ సూరిబాబు పురుగులు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన కుటుంబసభ్యులు అతనిని హుటా హుటిన ఆస్పత్రికి తరలించారు. ఆన్ లైన్ బెట్టింగ్ ఉచ్చులో పడి రూ. 1 కోటి 40 లక్షలు పోగొట్టుకున్నాడు.