కాకినాడ జిల్లాలో తమ్ముడిని అన్న కత్తితో నరికి చంపడం దారుణ ఘటన జరిగింది. తాళ్లరేవు మండలం పి.మల్లవరంలో కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ హత్య జరిగింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడికి సంబంధించిన వివరాలు సేకరించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. స్థానికులు ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.