Jan 24, 2025, 18:01 IST/
కళ్లు మిరిమిట్లు గొలిపేలా మహాకుంభమేళాలో డ్రోన్ షో (వీడియో)
Jan 24, 2025, 18:01 IST
ఉత్తర ప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళాలో డ్రోన్ షో అద్భుతంగా జరిగింది. ప్రభుత్వం జనవరి 24 నుంచి 26 వరకూ మహాకుంభమేళాలో డ్రోన్ షో నిర్వహించాలని యూపీ టూరిజం డిపార్ట్మెంట్ నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం ఒకేసారి ఆకాశంలోకి 2500 డ్రోన్స్ ఎగిరి వివిధ ఆకారాల్లో భక్తులకు కనువిందు చేశాయి. కళ్లు మిరిమిట్లు గొలిపే విధంగా ఈ డ్రోన్ షో సాగింది. ఈ ప్రదర్శన భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికత వెల్లువిరిసేలా కనిపించింది.