కాంక్రీట్ మిక్సర్ లారీ బోల్తా.. ఇద్దరు మహిళలు మృతి (వీడియో)

56చూసినవారు
మహారాష్ట్రలోని పుణెలో శుక్రవారం షాకింగ్ ఘటన జరిగింది. నగర శివారులోని హింజెవాడి ప్రాంతం సఖ్రే పాటిల్ చౌక్ వద్ద మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఓ కాంక్రీట్ మిక్సర్ లారీ బోల్తా పడింది. ఆ సమయంలో ఇద్దరు మహిళలు స్కూటీపై అటుగా వెళ్తున్నారు. వారిపై కాంక్రీట్ మిక్సర్ లారీ పడింది. దీంతో ఇద్దరు మహిళలు సంఘటనా స్థలంలోనే చనిపోయారు. ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్