డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం నర్సిపూడి గ్రామంలో బుధవారం రాత్రి నిర్వహించిన 34వ క్షీరాబ్ది ద్వాదశి కోటి దీపాల మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. గ్రామస్తులు మంత్రి సుభాష్ కు ఘన స్వాగతం పలికారు.