కొత్తపేట: పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత

83చూసినవారు
కొత్తపేట: పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత
పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆరోగ్య సిబ్బంది పిలుపునిచ్చారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట దొడ్డా వారి వీధిలో ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని శుక్రవారం సచివాలయం- 1, 4లో నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రైన్ లలో అబేట్ దోమల మందు చల్లారు. డ్రైన్లలో చెత్త వేయరాదని ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ వాడా సద్గుణ రావు, సచివాలయం ఏఎన్ఎం ఎన్. నాగమణి, ఆశాలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్