కొవ్వూరు నియోజకవర్గంలో వైసీపీ నేత రాజీవ్ కృష్ణను టీడీపీలో చేర్చుకోవడంపై కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం సాయంత్రం జరిగిన కార్యకర్తల సమావేశంలో వైసీపీ పార్టీ నుంచి రాజీవ్ కృష్ణ పలువురు వైసీపీ నేతలు పార్టీ అధిష్టానం వద్ద టీడీపీలో చేరడంపై కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరావు, టుమెన్ కమిటీని నిలదీశారు. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది.