ఆలమూరు వ్యవసాయ శాఖ సహాయ డైరెక్టర్ గా కాకి. నాగేశ్వరరావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ఏడిఏ సిహెచ్ కాశీ విశ్వనాథ్ చౌదరి రంపచోడవరం బదిలీ కావడంతో పిఠాపురం నుండి బదిలీపై వచ్చి విధుల్లో చేరారు. ఈ మేరకు ఏడిఏను ఆయన కార్యాలయంలో ఆలమూరు, కాపీలేశ్వరపురం ఏఓ లు కె. వి ఎన్ రమేష్ కుమార్ , ఎస్ లక్ష్మిలావణ్య మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందించి స్వాగతించారు. అలాగే ఆయా గ్రామాల నాయకులు నేతృత్వంలో ఆయా ఆర్బికే, వ్యవసాయ శాఖ సిబ్బంది ఈ సందర్భంగా ఆయనను అభినందించారు. సబ్ డివిజన్ పరిధిలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సిబ్బంది పూర్తి స్థాయిలో పనిచేసే విధంగా చర్యలు తీసుకుంటానని నాగేశ్వరావు పేర్కొన్నారు.