మండపేట పట్టణ పరిసరాల్లో పారిశుద్ధ్యం పాటించండి
మండపేట పట్టణ పరిధిలో సంపూర్ణ పారిశుద్యాన్ని పాటించాలని మున్సిపల్ కమిషనర్ టీవి రంగారావు పిలుపునిచ్చారు. పారిశుద్ధ్య పర్యవేక్షణలో భాగంగా మంగళవారం పట్టణంలోని మెయిన్ రోడ్ రాజారత్నం సెంటర్లలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా చెత్తలు రోడ్డుపై వేస్తున్న ఒక హోటల్ కు రూ. 200 రూపాయలు జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాపార సముదాయాల వద్ద రోడ్డుపై చెత్త పారవేయకుండా పరిశుభ్రతలు పాటించాలని సూచించారు.