కాట్రేనికోన గ్రామంలో పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను మంగళవారం అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ అవినాష్ తెలిపారు. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి రూ. 2, 030 నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు నమోదు చేసినట్లు చెప్పారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.