విజయానికి సహకరించాలని మల్లాడికి దాట్ల వినతి

1057చూసినవారు
ముమ్మిడివరం నియోజకవర్గ తెదేపా-జనసేన అభ్యర్ధిగా చోటు దక్కించుకున్న మాజీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు ఆదివారం యానాం వచ్చి మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావును కలుసుకున్నారు. తన గెలుపుకు సహకరించాలని కోరారు. తన నిర్ణయాన్ని కార్యకర్తలతో మాట్లాడి తెలియజేస్తానన్నారు. పేద ప్రజలకు అన్నిరకాలుగా అండగా నిలిచేవారికి మంచే జరుగుతుందన్నారు. పితాని బాలకృష్ణ, చెల్లి వివేకానంద, నాగిడి నాగేశ్వరరావు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్