ముంపుతో రైతులకు తప్పని ఇక్కట్లు

55చూసినవారు
ఏకదాటిగా కురుస్తున్న వర్షాలకు కాట్రేనికోన గెద్దనపల్లి, ఉప్పూడి, కుండలేశ్వరం సహ పలుచోట్ల ఇటీవల వేసిన నారుమళ్ళ ముంపునకు గురవు తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కుండలేశ్వరం లోని శ్రీరాంనగర్ వద్ద ఓల్డ్ అయినాపురం డ్రెయిన్ కు ఉన్న మురుగుడు బోదె పూడుకుపోవడంతో ముంపు నీరు దిగక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోతున్నారు. దీంతో రెండుసార్లు నారుమడులు వేసుకోవాల్సిన పరిస్థితులు నెలకోన్నాయని అంటున్నారు

సంబంధిత పోస్ట్