ముమ్మిడివరంలో అమలాపురం డీఎస్పీ టి. ఆర్. కె. ప్రసాద్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. నగర పంచాయతీ పరిధి శ్రీహరి సాకేత మందిరం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శుక్రవారం ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయం భక్తులతో కిటకిటలాడింది. అమలాపురం డీఎస్పీ దంపతులు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.