కాపులకు ఉద్యోగాల కల్పనలో ఐదు శాతం రిజర్వేషన్లు కేటాయించాలని జాతీయ కాపు సంఘం అధ్యక్షులు మురళీకృష్ణమనాయుడు కోరారు. ముమ్మిడివరం మండలం సిహెచ్ గున్నేపల్లిలో ఆదివారం జరిగిన సమావేశం మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి నూరు శాతం కృషి చేసిన కాపులకు సంపూర్ణ న్యాయం చేయాలన్నారు. కాపు కార్పొరేషన్ కు రూ. 15 వేల కోట్లు కేటాయించాలని కోరారు. పవన్ కళ్యాణ్‌ను సీఎం చేసేందుకు కృషి చేస్తామన్నారు.