మూడు క్రిమినల్ చట్టాలను, నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని ఐ. యఫ్. టి. యు జిల్లా సహాయ కార్యదర్శి గ్రీష్మ కుమార్ కోరారు. నిడదవోలు మండలం శెట్టిపేటలో ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన సభకు యూనియన్ ప్రెసిడెంట్ ఖండవల్లి వీర వెంకట్రావు నాయకత్వం వహించారు. ఈ సమావేశంలో పలువురు కార్మికులు పాల్గొన్నారు.