నిడదవోలు అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో ఏపీ సీఐడీ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంపై అవగాహన సదస్సును బుధవారం నిర్వహించారు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అదనపు ఎస్పీ అస్మ ఫర్హీన్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన వారి రక్షణకు ఉన్న చట్టాలను సక్రమంగా వినియోగించుకోవాలని ఆమె కోరారు. వారి అభ్యున్నతి దిశగా ప్రభుత్వ లక్ష్యం నెరవేర్చేందుకు ఈ శిక్షణా తరగతులు చేపట్టామన్నారు.