విధి నిర్వహణలో ఉపాధి కూలీ మృతి

5587చూసినవారు
పెద్దాపురం మండలం గుడివాడ గ్రామానికి చెందిన మావుళ్ళ భద్రరావు అనే ఉపాధి కూలీ గ్రామ. శివారు పంట కాలువ వద్ద పూడిక తొలగింపు పనులు చేస్తూ ఆకస్మికంగా కుప్పకూలాడు. శనివారం ఉదయం జరిగిన సంఘటనలో సహచర కూలీలు సమీపంలో ఉన్న వైద్యునివద్దకు తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు నిర్దారించారు. సంఘటనకు దారితీసిన పరిస్థితులపై ఉపాధి మండల అధికారులు ఆరా తీస్తున్నారు.

సంబంధిత పోస్ట్