సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం.. ఆ సినిమాపై నిషేధం?

76చూసినవారు
సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం.. ఆ సినిమాపై నిషేధం?
తెలంగాణ సీఎం రేవంత్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. నటి కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వం వహించిన 'ఎమర్జెన్సీ' సినిమా గురించి తెలిసిందే. ఈ మూవీలో తమ వర్గాన్ని ఉగ్రవాదులు, దేశద్రోహులుగా చిత్రీకరించారని 18 మంది సభ్యుల సిక్కు బృందం ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ వద్ద ఆందోళన వ్యక్తం చేయడంతో.. ఆయన సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకుని.. ఈ చిత్రాన్ని నిషేధించేందుకు ప్రయత్నిస్తానని రేవంత్ సిక్కులకు హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్