సామర్లకోటలో స్వచ్ఛత పక్వాడా

78చూసినవారు
సామర్లకోట రైల్వే స్టేషన్ లో ఆదివారం స్వచ్ఛతా పఖ్వాడా కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం స్టేషన్ అధికారులు పారిశుధ్య పనులు చేపట్టారు. ఈ సందర్భంగా స్టేషన్ లో వెయిటింగ్ హాల్స్ శుభ్రపరచడం, మెయిల్, బొకారో, విశాఖకు వెళ్ళు వందేభారత్ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకు చెత్తను డస్ట్‌బిన్‌లలో వేయాలని రైలు ప్రయాణీకులకు అవగాహన కల్పించడం చేశారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ మేనేజర్ రమేష్, కల్యాణి, కె. వి. గిరి, సిబ్బంది పాల్గోన్నారు.

సంబంధిత పోస్ట్