పిఠాపురంలో కుప్పకూలిన పురాతన భవనం

64చూసినవారు
పిఠాపురం పట్టణంలో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కారణంగా గోల్డ్ మార్కెట్ లో ఎంతో పురాతనమైన బిల్డింగ్ ఆదివారం కుప్పకూలింది. అనేక వ్యాపార కార్యకలాపాలకు ఈ భవనం నిలయమైంది. ఈ ప్రమాదం జరిగే సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇకనైనా మున్సిపల్ అధికారులు చొరవ తీసుకుని పిఠాపురం పట్టణంలోని ఇటువంటి పురాతన భవనాలపై ప్రత్యేక దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్