పిఠాపురం పట్టణ ఎస్ఐ మురళీ మోహన్ ను బదిలీ చేయొద్దని పలువురు నిరసన వ్యక్తం చేశారు. ఆదివారం రాత్రి న్యాయవాది కాలి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన నేతలతో కలసి స్టేషన్ ఎదుట ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్ఐ మురళీమోహన్ బాధ్యతలు తీసుకున్న తరువాత లా అండ్ ఆర్డర్ సమస్య లేకుండా ఉందన్నారు. ఈయన ఆధ్వర్యంలోనే ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయన్నారు.