టీ కప్పులతో వినాయకుడి ఆకృతి

81చూసినవారు
టీ కప్పులతో వినాయకుడి ఆకృతి
గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో ఆదర్ష్ ఇంజినీరింగ్ కళాశాలలో వినాయక చవితి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. కళాశాల ఆవరణలో మెకానికల్ ఇంజినీరింగ్ విద్యార్థులు టీ కప్పులతో రూపొందించిన వినాయక రూపం పలువురిని ఆకర్షించింది. వినాయక చవితిని పురస్కరించుకుని పర్యావరణానికి హాని కలగకుండా ప్రతి సంవత్సరం విభిన్న రూపాల్లో వినాయక ఆకృతులు తయారు చేయడం ఆనవాయితీగా వస్తోందని హెచ్ఓడీ సూర్య తెలియజేశారు.

సంబంధిత పోస్ట్