భారీగా కురుస్తున్న వర్షాలతో నాగార్జునసాగర్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. సాగర్‌కు ఇన్‌ఫ్లో 2,63 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. దీంతో తాజాగా అధికారులు 24 గేట్లు ఎత్తి 2.21 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 589.8 అడుగుల వరకు నీరు ఉందని అధికారులు తెలిపారు. సాగర్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకు ప్రస్తుతం 311.44 టీఎంసీల నీరు ఉంది.