కూటమి ప్రభుత్వంపై పిఠాపురం వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగా గీత గురువారం హాట్ కామెంట్స్ చేశారు. అధికారంలో ఉన్న ప్రభుత్వాలు అందరికీ న్యాయం జరిగే విధంగా,జరిగేవిధంగా, అందరినీ సమానంగా చూడాలన్నారు. సోషల్ మీడియాతో సంబంధం లేని వ్యక్తిపై కూడా కేసులు పెట్టడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందన్నారు. వైసీపీ శ్రేణులను టార్గెట్ చేసి వారి భవిష్యత్తును నాశనం చేసేవిధంగా కేసులు నమోదు చేయడం చాలా బాధాకరమని అన్నారు.