పిఠాపురం: గుంతలు పూడ్చేందుకు రూ. 10 కోట్లు నిధులు మంజూరు

78చూసినవారు
పిఠాపురం: గుంతలు పూడ్చేందుకు రూ. 10 కోట్లు నిధులు మంజూరు
పిఠాపురం మండలంలోని ఎఫ్. కె పాలెం గ్రామం నుంచి ఉప్పాడ ప్రధాన రహదారిలో గుంతలు పూడ్చి మరమ్మతు పనులు చేపట్టేందుకు కాకినాడ కలెక్టర్ షన్మోహన్, స్థానిక నాయకులతో కలిసి శనివారం భూమి పూజ చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాకినాడ జిల్లాకు 10 కోట్లు మంజూరు చేయగా పిఠాపురం నియోజకవర్గం నిమిత్తం 2. 60 కోట్లు ప్రభుత్వం మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్