పిఠాపురం మండలం చిత్రాడలో ఏర్పాటు చేసిన జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభకు పార్టీ నాయకులు అభిమానులు, కార్యకర్తలు, వీరమహిళలు ఉత్సాహంగా తరలి వచ్చారు. ఇతర ప్రాంతాల నుంచి రాష్ట్రాల నుంచి లక్షలాదిగా పవనన్న సైన్యం తరలివచ్చింది. అయితే ఈ సభలో జనసేన జెండాలతో పాటు, ప్రజారాజ్యం జెండాలతో పలువురు కార్యకర్తలు తరలివచ్చారు.