యు. కొత్తపల్లి మండలం యండపల్లి గోర్స గ్రామాల్లో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ ప్రచారంలో బుధవారం పేరాబత్తుల రాజశేఖరంకి మొదటి ప్రాధాన్యతను ఇచ్చి భారీ మెజారిటీతో గెలిపించాలని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ కోరారు. పట్టభద్రుల ఓటర్ల ఇంటికి వెళ్లి ఓటర్లను అభ్యర్ధించారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున జనసేన నాయకులు జనసైనికులు, వీర మహిళలు, కూటమి నాయకులు పాల్గొన్నారు.