కాకినాడ జిల్లా శంఖవరం మండలం అన్నవరం గ్రామ పంచాయతీ పరిధిలోని వేలంపేట వీధిలో గత 3 నెలల పై నుండి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మూసుకుపోయి రోడ్డు పై మురికి నీరు ప్రవహిస్తూ ప్రజలకు ఇబ్బందిగా మారింది. దీంతో అక్కడ స్థానిక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందికి లోనవుతున్నారు. దీని పై స్థానిక గ్రామస్తుడైన గోడే భద్రలక్ష్మీ పంచాయతీ వారికి లిఖిత పూర్వకంగా తెలియజేసిన, దానికి స్థానికులకు నోటీసులు ఇచ్చారే తప్ప చర్యలు చేపట్టలేదు. దీంతో అక్కడ రోజు రోడ్డు అస్తవ్యస్తంగా మారడంతో పాదాచారులకు ఇబ్బందులు తప్పడం లేదు. పంచాయతీ వారి పట్టించుకొనందున మండల, జిల్లా అధికారులు దీని పై చర్యలు చేపట్టాలని ఆ వీధి వారు కోరుతున్నారు.