ప్రత్తిపాడు నియోజకవర్గ రౌతులపూడి మండలం శృంగవరం గ్రామ సమీపంలో.. నాటు సారా స్థావరంపై దాడి చేసి 20 లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ వెంకటేశ్వరరావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. రౌతులపూడి మండలం శృంగవరం గ్రామానికి చెందిన నానాజీ అనే వ్యక్తి చెందిన నాటు సార స్థావరంపై దాడి చేసి 500 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసి నిందితుడిపై కేసు నమోదు చేశామని ఎస్ఐ వెంకటేశ్వరరావు తెలిపారు.