మురుగు కాలవలో శిశువు మృతదేహం

78చూసినవారు
మురుగు కాలవలో శిశువు మృతదేహం
అభం శుభం తెలియని శిశువు మృతదేహం మురుగు కాలువలో లభ్యం కావడం స్థానికులను కలచి వేసింది. రాజమండ్రి 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం సాయంత్రం ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆర్యాపురం ప్రధాన మురుగు కాలువలో మగ శిశువు మృతదేహం కనిపించడంతో పోలీసులు బయటకు తీయించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇంకా బొడ్డుతాడు కూడా తీయని శిశువు మృతదేహాన్ని కాలువలో పడేశారని, దీనిపై విచారణ చేపట్టామని ఎస్సై రామకృష్ణ తెలిపారు.