కాకినాడలో బుధవారం తెల్లవారుజాము నుంచిభారీ వర్షం పడింది. కుండపోతగా వాన కురిసింది. కాకినాడ నగరంలో ఏకధాటిగా వర్షం కుంభవృష్టిగా కురిసింది. దీంతో ఉదయం5 గంటల నుంచి వర్షం కురవడంతో నగరవాసులు ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షానికి ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి.. కురిసిన వర్షానికి జిల్లా కలెక్టరేట్ మునిగింది. పలు ప్రాంతాల్లో వర్షం నీరు తోరోడ్లు మునిగిపోవడంతో ప్రజలు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.