ఉత్తమనర్సరీ అవార్డు అందుకున్న పుల్లా వెంకట్రావు

70చూసినవారు
రాజమండ్రిలో రాజుభాయ్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి జరిగిన ఒక కార్యక్రమంలో కడియపులంక సత్యదేవా నర్సరీ యజమాని పుల్లా వీర వెంకట్రావు, సినీ నటుడు హైపర్ ఆది చేతుల మీదుగా ఉత్తమ నర్సరీ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా హైపర్ ఆది మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు నర్సరీలు చేస్తున్న కృషిని కొనియాడారు. ఈకార్యక్రమంలో పిప్పర నాగేశ్వరరావు, పంతం దుర్గాప్రసాద్ దాసరి రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్