మహిళా భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై మంగళవారం మహిళా రక్షక్ 60 మంది సిబ్బందితో రాజమండ్రి నగరంలో మంగళవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. తూ. గో జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి మహిళా పోలీస్ స్టేషన్ వరకు ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లా & ఆర్డర్ అడిషనల్ ఎస్పీ అల్లూరి వెంకట సుబ్బరాజు, సౌత్ జోన్ డీఎస్పీ భవ్య కిషోర్, మహిళా పోలీస్ ఇన్స్పెక్టర్ మంగాదేవి పాల్గొన్నారు.