విద్యార్థులు తమ విజ్ఞానాన్ని పెంచుకునేందుకు నూతన ఆవిష్కరణ చేపట్టడానికి కేంద్ర బిందువుగా సైన్స్ విజ్ఞాన కేంద్రం ఎంతో ఉపయోగపడుతుందని కలెక్టర్ ప్రశాంతి అన్నారు. సోమవారం రాజమండ్రిలోని బొమ్మూరు వద్ద నూతనంగా నిర్మించిన సైన్స్ విజ్ఞాన కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా సైన్స్ విజ్ఞాన కేంద్రాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.