గత ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను వెంటనే అమలు చేయాలని ఏపి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు సి. హెచ్ కోటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్ డిమాండ్ చేశారు. మంగళవారం రాజమండ్రిలో జరిగిన ఏపి వ్యవసాయ కార్మిక సంఘం తూ. గో జిల్లా జనరల్ బాడీ సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం మధ్యాంధ్రప్రదేశ్ మార్చిందని మండిపడ్డారు.