సెంట్రల్ వర్సిటీలో యూజీలో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పెంపు

67చూసినవారు
సెంట్రల్ వర్సిటీలో యూజీలో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పెంపు
సెంట్రల్ వర్సిటీలో యూజీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ దరఖాస్తుకు ఈనెల 26వ తేదీ వరకు గడువు పెంచినట్లు రాజమండ్రి కోఆర్డినేటర్ ఎ. రాజేంద్రనాథ్ సోమవారం తెలిపారు. దేశవ్యాప్తంగా 200కు పైగా యూనివర్సిటీల్లో సీట్ల కోసం ఈ ప్రవేశ పరీక్ష ఏటా నిర్వహిస్తారని అన్నారు. ఆసక్తిగల విద్యార్థులు సంబంధిత వెబ్ సైట్ ను సందర్శించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్