కడియం మండలం బుర్రిలంక నర్సరీ కూలి రౌతు కస్తూరి హత్య అత్యాచారం ఘటనపై రాజమండ్రి రూరల్ బీజేపీ నాయకులు విచారం వ్యక్తం చేశారు. ఆదివారం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ధైర్యాన్ని ఇచ్చారు. కుటుంబానికి బీజేపీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రొంగల గోపి శ్రీనివాస్, రూరల్ బీజేపీ కన్వీనర్ ఆకుల శ్రీధర్, కో కన్వీనర్ యానాపు ఏసు తదితరులు పాల్గొన్నారు.