కడియం: మట్టి ధరలు పెంచితే ఊరుకునేది లేదు

84చూసినవారు
కడియం: మట్టి ధరలు పెంచితే ఊరుకునేది లేదు
కడియం నర్సరీలకు మట్టి సరఫరా చేసే వ్యాపారులు అవసరాన్ని అదునుగా చేసుకుని ధరలు పెంచితే ఊరుకునేది లేదని రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు మార్గాని సత్యనారాయణ ఆదివారం హెచ్చరించారు. రూ. 10 వేలు ఉండే ఎర్రమట్టిని అమాంతం రూ. 15 వేలు చేసిన విషయంపై తాము రాష్ట్ర మంత్రులు, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లామన్నారు. దీనిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్