తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 148 గ్రామాల్లో ఇప్పటివరకు గ్రామ రెవెన్యూ సదస్సులను నిర్వహించి ప్రజల వద్ద నుంచి సమస్యలపై 1, 645 అర్జీలను స్వీకరించామని కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. సోమవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద రెవెన్యూ సదస్సుల నిర్వహణ, ఇతర ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో వారికి పలు సూచనలు చేశారు.