రాజమండ్రి: ఖాదీ, చేనేత వస్త్రాలను కొని ప్రోత్సహించాలి

82చూసినవారు
రాజమండ్రి: ఖాదీ, చేనేత వస్త్రాలను కొని ప్రోత్సహించాలి
ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి చేనేత రంగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్‌ పి. ప్రశాంతి అన్నారు. తూ. గో జిల్లా చేనేత - జౌళి శాఖ ఆధ్వర్యంలో రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం ఏర్పాటు చేసిన చేనేత ఉత్పత్తుల ప్రదర్శనను కలెక్టర్ పరిశీలించి మాట్లాడారు. చేనేత వస్త్రాలను ప్రోత్సహించడం ద్వారా లక్షలాది మంది కార్మికులకు జీవనోపాధి చూపించవచ్చని అన్నారు.

సంబంధిత పోస్ట్